Posts

నైతిక విలువలు లేని కరపత్రిక

Image
ఈనాడు దినపత్రికకు నైతిక విలువలు, పత్రిక ప్రమాణాలు ఉన్నాయి కాబట్టే పొరపాటు జరిగినా హుందాగా అంగీకరించింది. ధైర్యంగా పాఠకులకు చెప్పింది. "సవరణ" పేరుతో ఈనాడు నిర్భయంగా జరిగిన లోపాన్ని ప్రచురించింది. నిజంగా ప్రభుత్వంపై బురద చల్లాలనే ఎజెండాతో ఆ ఫోటోలు ప్రచురిస్తే ఇలా పొరపాటు జరిగింది అని వివరణ వేసుకునేది కాదు కదా?  సాక్షి తన జీవితంలో ఎప్పుడైనా తప్పులు ఒప్పుకుందా? నిజంగా సాక్షి కూడా సవరణ అని వేయాల్సి వస్తే తన పత్రికలో రోజూ 90 శాతం వార్తలకు సవరణ వేయాలి. ఎందుకంటే అందులో రాసేవి నూటికి 90 శాతం అవాస్తవాలే కాబట్టి. ఆత్మసాక్షి లేని సాక్షి వివేకా హత్యకేసులో చంద్రబాబే హంతకుడు అంటూ "నారాసుర రక్తచరిత్ర" అని రెండు పేజీలు వేసింది. కానీ సీబీఐ దర్యాప్తులో జగన్ కుటుంబం వైపే సీబీఐ వేలెత్తి చూపింది. సవరణ ఎందుకు వేయట్లేదు?  చివరగా... తెలుగు ప్రజలకు నందికి-పందికి మధ్య తేడా స్పష్టంగా తెలుసు 🤷🏻‍♂️

దేశాన్ని ఆధాని ఎలా దోచ్చుకున్నాడు?

Image
వాట్సాప్ లో ప్రపంచం ఎలా మన అదానీ మీద & మన దేశం మీద పగబట్టిందో చదువుతుంటే.. నాలో దవడ పళ్ళు బిగుసుకొన్నాయి. కోపం బుసలు కొట్టింది.  అదానీ కోల్పోయింది 11 లక్షలు అయితే చందా వేసేవాడిని. 11 లక్షల కోట్లకు పైగా. మన దేశభక్తులంతా అదానీ షేర్లు కొందాం మార్కెట్లో. మన మోడీ గారు ప్రధాని అవ్వక ముందు 2013లో పాతిక వేల కోట్ల పేద అదానీ, 2022 డిసెంబర్ అంటే రెండు నెలలకు ముందు 11 లక్షల కోట్లకు ఎదిగి, నేడు దబేల్మని 3 లక్షల కోట్లకు పడ్డారు. 2013లో  25671,72,00,000 2022 డిసెంబర్లో 1117968,75,00,000 నేడు 386694,91,35,000. ఈతేడాను పూడ్చితే మన దేశభక్తి ఇనుమడిస్తుంది, రండి ఈ రోజు నుండి కొందాం.. ఎలాన్ మస్కు వెనకాల మూడో ప్రపంచ కుబేరుడిగా నిలుపుదాం. వాట్సాప్ వ్యాసాలు తరువాత చదువుకొందాం. మన దేశ భక్తిని నిలుపుకొందాం.  ఏం నచ్చలేదా.  నువ్వు రూపాయి జేబు నుండి తియ్యవా? మరి దేశం మాత్రం సాకాలా ప్రపంచ కుబేరుడిగా.  న్యాయంగా.. తెలివిగా.. నైతికంగా.. ఎటువంటి టెక్నాలజీ  ఆవిష్కరణలు లేకుండా..  వాట్సాప్ దేశభక్తి బదులు పదేళ్లలో పదిన్నర లక్షల కోట్ల ఎదుగుదల వ్యాపార సూత్రాలను భరతజాతి భవిష్యత్ తరానికి వ...

లా నేస్తం' పథకానికి కోటి ప్రచారానికి 3 కోట్లు

లా నేస్తం' పథకానికి కోటి ప్రచారానికి 3 కోట్లు!   అంతూపొంతూ లేని జగన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చి 'చారాణా కోడికి.. బారాణా మసాలా మాదిరిగా.. చారాణా నిధికి.. బారాణా ప్రచారం' అన్నట్లుంది నిన్న సిఎం జగన్ రెడ్డి బటన్ నొక్కి 'లా నేస్తం'  పధకం  ప్రచారం. నిన్నా 'లా నేస్తం' పథకానికి 'బటన్' నొక్కి 2,011 మంది జూ. లాయర్లకురూ. 1,00,55,000 విడుదల ప్రకటనలకేమో మూడింతలు ఖర్చు సొంత పత్రికకూ భారీగా జనం సొమ్ము సంతర్పణ చేస్తున్నారు. ఈ నిధులు ప్రజల పన్నులు, యెడపేడ అప్పులు కుప్పలు మరియు కేంద్ర నిధులతో ఏ కార్యక్రమం చేపట్టినా 'జగనన్న' పేరుతో నింపేస్తున్నారని టీడీపీ నేతల విమర్శలు . శాసనమండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సీఎం మాత్రం ఫొటో లతో రూ.కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇస్తూ నియమావళిని తుంగలో తొక్కుతున్నారని, ఎన్నికల సంఘం అధికారులు వెంటనే స్పందించి ప్రకటనలు, బటన్ నొక్కుడు పై చర్యలు తీసుకోవాలి అని టీడీపీ నేతలు కోరుతున్నారు.

సంధింటి రక్తచరిత్ర, హైటెక్ లెవల్లో బాబాయ్ హత్య

Image
సంధింటి వారి మీద సంధింటి స్కెచ్ ను టెక్నాలజీ పట్టిచ్చింది. రాజారెడ్డి కాలం నుండి సంధింటి స్కెచ్ కి తిరుగులేదు. ఎన్నో స్కెచ్లు వేసిన బాబాయ్ వివేకాకు స్కెచ్ ను అదే సంధింట్లో వెయ్యడం కర్మ. హంతకులు లొకేషన్ ఆఫ్ చేసుకొకపోవడం ఒక కర్మ. ప్లాన్ బి ప్రకారం డ్రైవర్ మీద నెట్టేయడానికి లేఖ వ్రాసుకొన్నా నాయుడు అధికారంలో వుండడం ఒక కర్మ. ప్లాన్ ఎ గుండెపోటు వైకాపా రక్తపు వాంతుల కథలో రక్తపుమడుగు ఫోటో బయటకు రావడం ఒక కర్మ అప్పటికే గొల్లవీధిలో మర్డర్ అని గుప్పుమన్న వార్త వ్యాపించినా అవినాశ్ రెడ్డి మనుషులు వివేకానంద అభిమానులను దగ్గరకు రానివ్వకుండా నిలవరించడం ఒక కర్మ. ఉదయాన్నే వదినకు ఆ వార్త ఫోన్లో చేరవెయ్యడం విజసాయిరెడ్డితో ప్రకటించి సాక్షిలో స్క్రోలింగ్ వేయించడం మరో కర్మ. వివేకా రక్తపు మడుగు ఫోటో కుట్లేసి బ్యాండేజ్ వేసిన ఫోటోలు టెక్నాలజీ ద్వారా సోషల్మీడియాలో వెంటనే లోకాన్ని చుట్టడం ఒక కర్మ. అనుమానం వున్నా సంధింటి రక్తసంబంధాన్ని గుడ్డిగా నమ్మి జగన్ కు మద్దతుగా మీడియాలో సునీతమ్మ మాట్లాడడం జనం కర్మ. ఎప్పుడూ కూతురికి చెప్పి ఇచ్చిన మందులు తీసుకువెళ్లే వివేకా ముందురోజు ఉదయం జగన్ రెడ్డి ఇంటి నుండి కన్నీళ...

జీవిత సత్యం

ఒక తండ్రి చనిపోయే ముందు కొడుకు ని పిలిచి... ఈ చేతి గడియారం 200 సంవత్సరాల పూర్వం మీ ముత్తాత వాడినది. ఒకసారి నగల దుకాణం దగ్గరకు వెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు, ఎంత ఇస్తారో అడుగు అంటాడు. కొడుకు నగల దుకాణంకు వెళ్ళి అడిగితే చాలా పాతది కాబట్టి 150 రూపాయలు ఇవ్వగలం అంటారు. అదే విషయం తండ్రికి చెప్తే ఒకసారి పాన్ షాప్ దగ్గర అడిగి చూడు పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగా త్రుప్పు పట్టి ఉంది 10 రూపాయలకి కొనగలను అని చెప్తాడు. ఈ సారి తండ్రి కొడుకుతో.. మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు. వాళ్ళు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియూ అత్యంత అరుదైనది. 5 లక్షలు ఇవ్వగలం అంటారు. అప్పుడు తండ్రి కొడుకుతో..."ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది. నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు, అలా అని వారి మీద కోపం వద్దు; వారితో వాదించి కూడా ప్రయోజనం ఉండదు. నీకు తగిన విలువ దొరికిన చోట ఉండు" అని చెప్తాడు...