దేశాన్ని ఆధాని ఎలా దోచ్చుకున్నాడు?


వాట్సాప్ లో ప్రపంచం ఎలా మన అదానీ మీద & మన దేశం మీద పగబట్టిందో చదువుతుంటే.. నాలో దవడ పళ్ళు బిగుసుకొన్నాయి. కోపం బుసలు కొట్టింది. 

అదానీ కోల్పోయింది 11 లక్షలు అయితే చందా వేసేవాడిని. 11 లక్షల కోట్లకు పైగా. మన దేశభక్తులంతా అదానీ షేర్లు కొందాం మార్కెట్లో.

మన మోడీ గారు ప్రధాని అవ్వక ముందు 2013లో పాతిక వేల కోట్ల పేద అదానీ, 2022 డిసెంబర్ అంటే రెండు నెలలకు ముందు 11 లక్షల కోట్లకు ఎదిగి, నేడు దబేల్మని 3 లక్షల కోట్లకు పడ్డారు.

2013లో 
25671,72,00,000

2022 డిసెంబర్లో
1117968,75,00,000

నేడు
386694,91,35,000.
ఈతేడాను పూడ్చితే మన దేశభక్తి ఇనుమడిస్తుంది, రండి ఈ రోజు నుండి కొందాం.. ఎలాన్ మస్కు వెనకాల మూడో ప్రపంచ కుబేరుడిగా నిలుపుదాం. వాట్సాప్ వ్యాసాలు తరువాత చదువుకొందాం. మన దేశ భక్తిని నిలుపుకొందాం. 

ఏం నచ్చలేదా. 

నువ్వు రూపాయి జేబు నుండి తియ్యవా?

మరి దేశం మాత్రం సాకాలా ప్రపంచ కుబేరుడిగా. 

న్యాయంగా.. తెలివిగా.. నైతికంగా.. ఎటువంటి టెక్నాలజీ  ఆవిష్కరణలు లేకుండా.. 

వాట్సాప్ దేశభక్తి బదులు

పదేళ్లలో పదిన్నర లక్షల కోట్ల ఎదుగుదల వ్యాపార సూత్రాలను భరతజాతి భవిష్యత్ తరానికి వివరించండి. ప్రపంచాన్ని భరతజాతి శాసించకపోతే అడగండి.

జీతాలు ఇవ్వలేని ఆంధ్రాను కూడా అదానీ పంటి క్రింద బఠానీ లెక్కన నమిలించారు కదరా. 

ఎవ్వడో షార్ట్ షెల్లింగ్స్ చేస్తే కూలే స్థితిలో వుంటే అది నైతిక వ్యాపారం అయ్యి వుండదు. నైతికిత వుంటే నిలబడుతుంది.

జాక్ మా తెలుసా.. అదే  కనిపించకుండా పోయిన చైనా వ్యాపార దిగ్గజం. నిన్న ఆస్ట్రేలియాలో కనిపించాడని ఒక వార్త. ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గుకు ఏమన్నా పోటీ వస్తాడేమో అనే ఏంగిల్లో వాట్సాప్ లో దేశ భక్తిని రగిలించడానికి పనికివస్తుందేమో ఆలోచించండి. #చాకిరేవు

గమనిక: అదానీ విల్మార్ షేర్లు ఐపీఓలో కొన్నా. మూడు రోజుల క్రితం లాభానికే వదిలించుకొన్నా. 14 కిలోమీటర్ల నూనె వైపు లైన్లు వుంది అదీ ఇదీ అని వికీనే మార్చుతున్న  అదానీ ప్రచారం నమ్మి. బండారం బయటపడ్డాక ఆలోచించే అమ్మేశాను. కేవలం ఒక లాట్ 65 షేర్లు కావచ్చు. కానీ జీవితకాల నమ్మకం కోల్పోయాడు.

Comments

Popular posts from this blog

లా నేస్తం' పథకానికి కోటి ప్రచారానికి 3 కోట్లు