నైతిక విలువలు లేని కరపత్రిక

ఈనాడు దినపత్రికకు నైతిక విలువలు, పత్రిక ప్రమాణాలు ఉన్నాయి కాబట్టే పొరపాటు జరిగినా హుందాగా అంగీకరించింది. ధైర్యంగా పాఠకులకు చెప్పింది. "సవరణ" పేరుతో ఈనాడు నిర్భయంగా జరిగిన లోపాన్ని ప్రచురించింది. నిజంగా ప్రభుత్వంపై బురద చల్లాలనే ఎజెండాతో ఆ ఫోటోలు ప్రచురిస్తే ఇలా పొరపాటు జరిగింది అని వివరణ వేసుకునేది కాదు కదా? సాక్షి తన జీవితంలో ఎప్పుడైనా తప్పులు ఒప్పుకుందా? నిజంగా సాక్షి కూడా సవరణ అని వేయాల్సి వస్తే తన పత్రికలో రోజూ 90 శాతం వార్తలకు సవరణ వేయాలి. ఎందుకంటే అందులో రాసేవి నూటికి 90 శాతం అవాస్తవాలే కాబట్టి. ఆత్మసాక్షి లేని సాక్షి వివేకా హత్యకేసులో చంద్రబాబే హంతకుడు అంటూ "నారాసుర రక్తచరిత్ర" అని రెండు పేజీలు వేసింది. కానీ సీబీఐ దర్యాప్తులో జగన్ కుటుంబం వైపే సీబీఐ వేలెత్తి చూపింది. సవరణ ఎందుకు వేయట్లేదు? చివరగా... తెలుగు ప్రజలకు నందికి-పందికి మధ్య తేడా స్పష్టంగా తెలుసు 🤷🏻♂️